Saturday, October 5, 2024
Homeతెలంగాణమూసీ నిర్వాసితుల‌కు అండ‌గా ఉంటాం

మూసీ నిర్వాసితుల‌కు అండ‌గా ఉంటాం

Date:

మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని, బఫర్‌జోన్‌లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామనని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఫాంహౌస్‌లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారని మందిపడ్డారు. ప్రత్యామ్నాయం అడిగితే చెప్పే స్థితిలో రెచ్చగొట్టేవారు లేరని చెప్పుకొచ్చారు. మూసీ అంశం పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసారు. మూసీ నిర్వాసితుల కోసం బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ నిధిగా ఉన్న రూ 1500కోట్లలో రూ 500 కోట్లు ఇవ్వచ్చు కదా అని వ్యాఖ్యానించారు. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని, చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరానికి వరద పోటెత్తితే వరదను భరించే దారి ఏముందని ప్రశ్నించారు. చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయని హెచ్చరించారు.

గత ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితిని అందరూ చూశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పూర్తిగా కాంక్రీట్‌ జంగిల్ గా మారిందని, గ్రౌండ్ వాటర్‌ పూర్తిగా పడిపోయిందన్నారు. అలాగే విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తామని, తనకు రాష్ట్ర అభివృద్దితో పాటుగా.. ప్రజా సంక్షేమం సైతం ముఖ్యని రేవంత్ స్పష్టం చేసారు. మూసీ నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దామని రేవంత్ పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వం తరపున చేయవలసిన ప్రతి చర్యకు తాను బాధ్యత తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.