Wednesday, October 2, 2024
Homeతెలంగాణమెరుగైన స‌మాజానికి అహింసా మార్గం అవ‌స‌రం

మెరుగైన స‌మాజానికి అహింసా మార్గం అవ‌స‌రం

Date:

గాంధీ మార్గాన్ని అంద‌రూ అనుస‌రించాల‌ని అది వ్య‌క్తికి, స‌మాజానికి చాలా మేల‌ని హైకోర్టు న్యాయ‌మూర్తి సుజ‌య్ పాల్ అన్నారు. అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి సంధ‌ర్బంగా చంచ‌ల్ గూడ జైలులో జ‌రిగిన వేడుకల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. ఆయ‌నతో పాటు జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా, న్యాయాధికారి పంచాక్ష‌రి, చంచ‌ల్ గూడ జైలు సూప‌రిండెంటెంట్ శివ‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ హింస వైపు వెళ్ల‌డం అనేది బలహీనతకు చిహ్నమని, అహింసా మార్గం అనేది మెరుగైనా సమాజానికి అవసరమని, ఆనాడే గాంధీ గారు ఆచరించి దేశానికి స్వాతంత్రం సంపాదించటంలో కీలక పాత్ర పోషించారని హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ పేర్కొన్నారు.

జైళ్ల‌శాఖ‌ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల జైళ్లకు తెలంగాణ జైళ్లు ఆదర్శమని, ఇక్కడి సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల వారు అనుసరిస్తున్నారని, ఇక్కడ సంస్కరణలు నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నారు. ఇటీవలే ప్రభుత్వాన్ని ఒప్పించి సత్ప్రవర్తన కల ఖైదీలను విడుదల చేశామని, జైళ్లలో పనిచేసే ఖైదీల యొక్క వేతనాలు పెంచాలనే సిఫారసులను నిన్ననే ప్రభుత్వం ఆమోదించినదని, తాము నిరంతరం ఖైదీల యందు మార్పుకోసం కృషి చేస్తుంటామని తెలిపారు.

అంతకు ముందు జైల్ సూపరిండెంటెంట్‌ శివ కుమార్ గౌడ్ చంచల్ గూడ జైలు యొక్క వార్షిక నివేదిక సమర్పించినారు. ఈ కార్యక్ర‌మంలో జైలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.