Monday, September 30, 2024
Homeతెలంగాణతెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై సీఎం స‌మీక్ష‌

తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై సీఎం స‌మీక్ష‌

Date:

తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష చేశారు. 119 నియోజకవర్గాల్లో గ్రామాలు, వార్డులు లేదా డివిజన్లను ఎంపిక చేశామని అధికారులు సీఎంకి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టును అక్టోబరు 3 నుంచి 7 వరకు 5 రోజులు నిర్వహిస్తామన్నారు. ఐతే.. ఫ్యామిలీ ఫొటో తియ్యాలా వద్దా అనే డౌట్ రాగా.. కుటుంబ సభ్యులు అనుమతిస్తే తియ్యాలనీ, లేదంటే తియ్యవద్దని సీఎం తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై అధికారులు లోతైన దర్యాప్తు చేశారు. ప్రభుత్వం దగ్గర ఉన్న‌ రేషన్ కార్డులు, పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, పంట మీహా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి పథకాల డేటాను లెక్కలోకి తీసుకున్నారు. తద్వారా ఓ జాబితా రెడీ చేసుకున్నారు. ఐతే.. అదే ఫైనల్ లిస్ట్ కాదు. పరిస్థితులను బట్టీ అందులో పేర్లు చేర్చడాలు, తొలగించడాలూ ఉంటాయి.

ఓ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు మరీ మరీ చెప్పారు. కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకూడదని స్పష్టం చేశారు. 5 రోజుల పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యాక.. పూర్తి రిపోర్ట్ రెడీ చేసి తనకు ఇవ్వాలన్నారు. అధికారులు ఇచ్చే రిపోర్టును పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పోల్చి చూసి, తదనుగుణంగా ప్లాన్ అమలుచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అప్పుడే ఇవ్వరని అనుకోవచ్చు. అధికారులు రిపోర్ట్ ఇవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. తర్వాత సీఎం పరిశీలన, ప్రభుత్వ పరిశీలనకి మరికొంత టైమ్ పడుతుంది. అక్టోబర్‌లో కాకుండా, నవంబర్‌లో ఇచ్చే అవ‌కాశం ఉంది.