Monday, September 30, 2024
Homeప్రత్యేక కథనాలుదేశంలో అత్య‌ధిక ఆదాయాన్ని తెచ్చే రైలు ఇదే..

దేశంలో అత్య‌ధిక ఆదాయాన్ని తెచ్చే రైలు ఇదే..

Date:

భార‌తీయ రైల్వే సేవ‌లు 1853లో ప్రారంభ‌మ‌య్యాయి. మొద‌ట‌గా ముంబయి, థానే మధ్య రైలు నడిచింది. నేడు భారతదేశం అంతటా ప్రజలను కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 67,000 కిలోమీటర్ల ట్రాక్‌లతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. భారత రైల్వే నెట్‌వర్క్‌ను 18 జోన్లుగా విభజించారు. ప్యాసింజర్, ఫ్రైట్, లగ్జరీ రైళ్లు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటి ద్వారా రైల్వేస్ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఒక ట్రైన్ ద్వారా సంవత్సరానికి ఏకంగా రూ.176కోట్ల ఆదాయం వస్తోంది. ఇది దేశంలోనే ఎక్కువ రెవిన్యూ అందించే ట్రైన్ సర్వీస్‌గా నిలుస్తోంది.

*వివిధ రకాల రైళ్లు*

భారత రైల్వే నెట్‌వర్క్‌లో చాలా రకాల రైళ్లు సేవలు అందిస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను అలాగే లోకల్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కలిగి ఉంది. కొత్తగా ప్రారంభం అయిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గించాయి. ఈ రైళ్లను మరిన్ని మార్గాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే ప్రయాణిస్తుంది. సరకుల రవాణాకు ఉపయోగించే గూడ్స్‌ రైళ్లు కూడా రైల్వేకి ప్రధాన ఆదాయం అందిస్తున్నాయి. ఈ రైళ్లు భారతదేశ రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి.

*అత్యంత లాభదాయకమైన రైలు*

వందే భారత్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు పాపులర్‌ అయినప్పటికీ అవి ఎక్కువ లాభదాయకం కాదు. హజ్రత్ నిజాముద్దీన్, KSR బెంగళూరు మధ్య నడిచే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.22692) అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైళ్లలో టాప్ ప్లేస్‌లో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు 5,09,510 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. తద్వారా ఏకంగా రూ.1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది.

*రెండో స్థానంలో కోల్‌కతా- న్యూఢిల్లీ*

దీనికి దగ్గరల్లో కోల్‌కతా నుంచి న్యూఢిల్లీకి నడిచే సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12314) ఉంది. ఇది 5,09,164 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఏకంగా రూ.1,28,81,69,274 సంపాదించింది.

*మూడో స్థానంలో న్యూఢిల్లీ- దిబ్రూఘర*

మూడో స్థానంలో న్యూ ఢిల్లీ, దిబ్రూఘర్ మధ్య నడుస్తున్న దిబ్రూగర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉంది. ఈ ట్రైన్‌లో అతే సమయంలో 4,74,605 మంది ప్రజలు ప్రయాణించారు. రూ.1,26,29,09,697 సంపాదించి మూడో స్థానం దక్కించుకుంది.

*ప్రపంచంలోనే బెస్ట్*

భారతీయ రైల్వే దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థగా రికార్డు అందుకుంది. ప్రజలకు తక్కువ ధరలకు మెరుగైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తూ, భారత ఆర్థిక వస్యవస్థకు తోడ్పడుతోంది. టికెట్ సేల్స్ ద్వారా భారీగా ఆదాయం అందుకుంటోంది.