Sunday, September 29, 2024
Homeజాతీయంస్నేహపూర్వకంగా ఉంటే సాయం చేసేవాళ్లం

స్నేహపూర్వకంగా ఉంటే సాయం చేసేవాళ్లం

Date:

భారత్‌తో పాకిస్థాన్ సత్సంబంధాలు కొనసాగించి ఉంటే.. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఇస్లామాబాద్ కోరిన దానికంటే పెద్ద ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేవాళ్లమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టికల్ 370’ రద్దుపై అక్కసుతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు యత్నిస్తోందని, ఇక్కడ ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవడం ఆ దేశానికి ఇష్టం లేదన్నారు.

”2014-15లో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అది ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరుకుంది. ఐఎంఎఫ్‌ నుంచి పాకిస్థాన్‌ కోరిన బెయిల్అవుట్ ప్యాకేజీ కంటే ఇది చాలా పెద్దది. ఒకవేళ ఆ దేశం స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి ఉంటే ఐఎంఎఫ్‌ కంటే ఎక్కువే సాయం చేసేవాళ్లం” అని గురేజ్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. పొరుగు దేశం చాలా కాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని, తన భూభాగంపై ఉగ్ర కార్యకలాపాల నిర్వహణకు ఇతర దేశాల నుంచి డబ్బు అడుగుతోందని ఆరోపించారు.