Wednesday, October 30, 2024
Homeజాతీయంముదిరిన రీల్స్ పిచ్చి.. సైన్‌బోర్డుపై పుల్‌ అప్స్‌

ముదిరిన రీల్స్ పిచ్చి.. సైన్‌బోర్డుపై పుల్‌ అప్స్‌

Date:

సోషల్‌ మీడియాలో ప్రత్యేక గుర్తింపు కోసం చాలా మంది తెగ ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకొంది. రహదారిపై ఉండే సైన్‌బోర్డు పైకి ఎక్కి ఓ యువకుడు పుల్‌ అప్స్‌ తీస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

అమేఠీలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు ప్రమాదకర స్టంట్లకు పాల్పడ్డాడు. రోడ్డుపై ఉండే సైన్‌బోర్డు పైకి ఎక్కి పుల్‌ అప్స్‌ తీశాడు. నేల నుంచి 10 మీటర్లకుపైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్లు చేశాడు. మరో యువకుడు కూడా పైకి ఎక్కి అతడిని వీడియో తీశాడు. ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలు ప్రమాదంలో పడేవి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇలాంటి స్టంట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.