హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై హైడ్రా కోసం పనిచేయనున్నారు. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనుంది. హైడ్రాను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.