Sunday, December 22, 2024
Homeక్రైందొంగ‌నోట్ల కంపెనీ పెట్టిన దొంగ‌ల ముఠా

దొంగ‌నోట్ల కంపెనీ పెట్టిన దొంగ‌ల ముఠా

Date:

డ‌బ్బుల‌కు ఇబ్బంది అవుతుంద‌నుకున్నారో మ‌రీ బాగా సంపాదించి విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌నుకున్నారో తెలియదు కాని గుజరాత్ లో ముగ్గురు దొంగ‌లు ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టేసారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని సార్థనలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

మొదట గార్మెంట్స్ షాపు పేరిట దొంగనోట్ల తయారీకి పాల్పడుతున్న భవేష్ రాథోడ్‌ను సూరత్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవేష్‌ను విచారించగా ముఠాలోని మిగతా ముగ్గురి వివరాలు భ‌వేష్ వెల్లడించాడు. తాను గత నెలరోజులుగా దొంగనోట్లు ముద్రిస్తున్నానని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అమ్రేలికి చెందిన రాహుల్ చౌహన్, సాగర్, పవన్ బానోడ్ లు తనకు సహకరించినట్లు రాథోడ్‌ తెలిపాడు. దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి రూ. 1లక్ష విలువచేసే 100రూపాయల దొంగనోట్లు, ఒక కంప్యూటర్, స్కానర్, క్లౌడ్ ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నారు.