Friday, January 3, 2025
Homeఅంతర్జాతీయంఅంతరిక్షంలోనే సునీతా విలియమ్స్ బర్త్‌డే వేడుకలు

అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్ బర్త్‌డే వేడుకలు

Date:

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాల వల్ల రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్ 19న సునీత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 59వ బర్త్‌డేను ఆమె భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రంలో నిర్వహించుకున్నారు.

పుట్టినరోజున ఆమె బిజీ షెడ్యూల్‌ గడిపారు. తనతోటి వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను శుభ్రం చేసుకున్నారు. స్మోక్‌డిటెక్టర్ల పనితీరును పరీక్షించారు. ఇదంతా రొటీన్‌ పనే అయినప్పటికీ.. ఐఎస్ఎస్‌లో ఉన్నవారి ఆరోగ్యం, భద్రతకు చాలా కీలకమని వ్యోమగాములు చెబుతారు. అనంతరం వారు హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లోని డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా వ్యోమగాముల లక్ష్యాలు, చేయాల్సిన పనులు, వివిధ శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడారు. కాగా.. అంతరిక్షంలో బర్త్‌డే చేసుకోవడం ఆమెకు ఇది రెండోసారి. గతంలో 2012లోనూ ఆమె తన పుట్టినరోజున మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్‌లోనే ఉన్నారు.