Sunday, December 22, 2024
Homeజాతీయం2026వరకు నక్సలిజం తుడిచిపెట్టుకపోతుంది

2026వరకు నక్సలిజం తుడిచిపెట్టుకపోతుంది

Date:

2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. హింసను వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈమేరకు వ్యాఖ్యానించారు.

దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు పశుపతినాథ్‌ (నేపాల్‌) నుంచి తిరుపతి వరకు కారిడార్‌ ఏర్పాటుచేయాలని భావించారని కానీ, మోదీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే మావోయిస్టుల అంతానికి ఆల్‌- అవుట్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించారన్నారు.