Monday, December 30, 2024
Homeఅంతర్జాతీయంలంచ్, కాఫీ బ్రేక్‌లలో శృంగారంలో పాల్గొనండి

లంచ్, కాఫీ బ్రేక్‌లలో శృంగారంలో పాల్గొనండి

Date:

రష్యాలో జననాల రేటు పడిపోతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్ సర్కార్.. ప్రజలకు కీలక సూచన ఇచ్చింది. లంచ్, కాఫీ బ్రేక్‌లలో శృంగారంలో పాల్గొనాలని వింత సూచన చేసింది. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఆ దేశంలో చర్చకు దారితీశాయి. రష్యాలో జననాల రేటు రోజురోజుకూ పడిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. సంతానోత్పత్తిని పెంచాలని సూచించారు. ఇందులో భాగంగానే రష్యా ప్రజలు.. పనివేళల్లో భోజన విరామం, కాఫీ విరామాల్లో శృంగారంలో పాల్గొనాలని పేర్కొ్న్నారు. తద్వారా దేశ జనాభా రేటు క్షీణతను తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రష్యాలో స్థిరమైన జనాభా కోసం సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు 2.1గా ఉండగా.. ఆ దేశంలో ప్రస్తుతం 1.5గా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఈ సూచన చేశారు. అయితే రష్యాలో జనాభా పెరుగుదల ఆవశ్యకతను గతంలో పుతిన్ గుర్తు చేశారు.

రష్యా ప్రజల సంరక్షణ అనేది తమ దేశ జాతీయ ప్రాధాన్యత అని పుతిన్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 10 లక్షలకు పైగా యువకులు రష్యాను వీడినట్లు తెలుస్తోంది. ఓవైపు.. సంతానోత్పత్తి రేటు తగ్గడం, మరోవైపు.. యువత దేశాన్ని వీడటంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రష్యాలో తగ్గుతున్న సంతానోత్పత్తిపై ఆ దేశ ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ స్పందించారు. చాలా మంది జనం.. పిల్లల్ని కనేందుకు వెనక్కి తగ్గుతున్నారని.. అయితే జీవితం తొందరగా ముగుస్తుందని గుర్తు చేశారు. అందుకే రోజుకు 12 నుంచి 14 గంటలు పని చేసేవారు కూడా తమకు దొరికిన కాస్త బ్రేక్‌ సమయంలోనైనా సంతానోత్పత్తి పెంచేందుకు సెక్స్‌లో పాల్గొనాలని ప్రజలకు సూచించారు.