Saturday, September 21, 2024
HomeUncategorizedతెలంగాణకు రాని భారత్ రైస్

తెలంగాణకు రాని భారత్ రైస్

Date:

దేశంలో బియ్యం ధరలు అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.29 బియ్యం విక్రయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ పేరుతో బుధవారం అమ్మకాలు చేపట్టింది. 5 కిలోల బ్యాగ్, 10 కిలోల బ్యాగ్ ల్లో అమ్మకాలు చేపట్టింది. భారత్ బియ్యాని పలు చోట్ల విక్రయిస్తున్నారు. భారత ఆహార సంస్థ నుంచి 5 లక్షల టన్నుల బియ్యాన్ని జాతీయ వ్యసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్యలో విక్రయిస్తున్నారు. అలాగే కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రాల్లో అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్యకు చాలా మంది భారత్ రైస్ కోసం వస్తున్నారు. అయితే హైదరాబాద్ కు ఇంకా భారత్ రైస్ రాలేదు.

తెలంగాణలో ఫోర్టిఫైయిడ్ లిస్ట్ లో ఉండడం వల్ల రాష్ట్రానికి భారత్ రైస్ రాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర కేంద్రంతో సంప్రదింపులు జరపాలని పలువురు కోరుతున్నారు. అస్సలు ఫోర్టిఫైయిడ్ రైస్, నాన్ ఫోర్టిఫైయిడ్ రైస్ అంటే ఏమిటో చూద్దాం. బియ్యంలో సూక్ష్మ పోషకాలను కలిపి బియ్యం నాణ్యత పెంచడాన్ని ఫోర్టిఫికేషన్‌ అంటారు. ప్రస్తుతం తెలంగాణలో రేషన్ షాపుల్లో ఫోర్టిఫైయిడ్ రైస్ సప్లాయి చేస్తున్నారు. బియ్యంలో ఎలాంటి పోషకాలు కలపుకుండా ఉంటే వాటిని నాన్ ఫోర్టిఫైయిడ్ రైస్ అంటారు. నాన్ ఫోర్టిఫైయిడ్ లిస్ట్ తెలంగాణ లేకపోవడం వల్ల భారత్ బియ్యం రాలేదని తెలుస్తోంది. అయితే నాఫెడ్ ద్వారా గోధుమ ఆటా, శనగ పప్పు అమ్ముతున్నారు. గోధుమ పిండిని కిలోకు రూ.27.60 లకు విక్రయిస్తున్నారు. అలాగే శనగ పప్పును కిలో రూ.60 లకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో హఫిజ్ పేట, మలక్ పేట, ఎర్రగడ్డ, బేగంపేట, బాలపూర్, వనస్థలిపురం, జీడిమెట్ల, హయత్ నగర్, పటాన్ చెరు, మీర్ పేట, బోరబండ, అమీర్ పేట, ఎల్బీనగర్ లో విక్రయ కేంద్రాలు ఉన్నాయి.