Saturday, September 21, 2024
HomeUncategorizedవిదేశీ విద్యకు ఆర్థిక భరోసా

విదేశీ విద్యకు ఆర్థిక భరోసా

Date:

పెద్ద, పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని చాల మంది కలలుకంటారు. కానీ ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు భారీగా ఉండటంతో విదేశాల్లో చదువుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. ఐతే కొన్ని సంస్థలు స్కాలర్‌షిప్ ప్రకటిస్తూ మెరిట్ విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నాయి. అందులో ఫ్రాన్స్ ఎక్సలెన్స్ ఛార్పిక్ స్కాలర్‌షిప్ ఒకటి. ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్కాలర్‌లకు ఆ దేశ ప్రభుత్వం స్టైఫండ్ ప్రకటిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, ఎంపిక వివరాలను పరిశీలిద్దాం.

ఛార్పక్ బ్యాచిలర్ స్కాలర్‌షిప్ వివరాలు https://www.inde.campusfrance.org అనే పోర్టల్‌లో పేర్కొన్నారు. ఫ్రెంచ్ ఉన్నత విద్యా సంస్థల్లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం 860 యూరోల (సుమారు రూ.76,000) నెలవారీ జీవన భత్యాన్ని మంజూరు చేస్తారు. సామాజిక భద్రత కవరేజ్, వసతి ఖర్చులు అదనంగా లభిస్తాయి.

భారతీయ విద్యార్థులు అర్హులే

ఛార్పాక్ బ్యాచిలర్ స్కాలర్‌షిప్ కోసం భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశపు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ సైతం దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థి వయసు 23 సంవత్సరాలలోపు ఉండాలి. గతంలో ఫ్రాన్స్‌లో చదివి ఉండకూడదు. భారతదేశంలో సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. 2024 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే బ్యాచిలర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసి ఉండాలి.

  • దరఖాస్తు విధానం

దరఖాస్తుదారులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఫ్రెంచ్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొంది ఉండాలి. అడ్మిషన్-రిలేటెడ్ ఎంక్వైరీ భారతదేశంలోని ఫ్రాన్స్ క్యాంపస్ ఆఫీస్ లేదా సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఉండవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా https://ifi.scholarship.ifindia.in/ అనే పోర్టల్ ద్వారా పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ కాపీ, కరికులం విటే, ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అడ్మిషన్ లెటర్, 12వ తరగతి, 10వ తరగతి మార్కు షీట్స్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. DELF లేదా DALF వంటి ఫ్రెంచ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.

  • ఎంపిక విధానం

అభ్యర్థి అకడమిక్ పర్ఫార్మెన్స్, స్థిరత్వం, క్వాలిటీ స్టేట్‌మెంట్ పర్పస్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. నిర్దిష్ట CGPA/పర్సెంటైల్ కటాఫ్ అర్హత అవసరం లేదు. ఫ్రాన్స్ ఎక్సలెన్స్ ఛార్పిక్ స్కాలర్‌షిప్ కోసం ఇండియన్ స్టూడెంట్స్ ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే మధ్యలో ఫలితాలు వెలువడతాయి. విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థుల ముఖ్య గమ్యస్థానాలుగా అమెరికా, యూకే ఉన్నాయి. అయితే ఈ దేశాల్లో ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫ్రాన్స్‌లో నాణ్యమైన విద్యతో పాటు జీవన ఖర్చులు తక్కువగా ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య చదవడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.