Sunday, December 22, 2024
Homeక్రైండాక్ట‌ర్ ప్రైవేట్ భాగాన్ని కోసిన‌ న‌ర్సు

డాక్ట‌ర్ ప్రైవేట్ భాగాన్ని కోసిన‌ న‌ర్సు

Date:

ఓ వైద్యుడితో పాటు మ‌రో ఇద్ద‌రు ఓ న‌ర్సుపై సామూహిక అత్యాచారానికి ప్ర‌య‌త్నించారు. వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో న‌ర్సు బ్లేడ్‌తో డాక్ట‌ర్ ప్రైవేట్ భాగాన్ని కోసింది. హాస్పిటల్‌ నుంచి బయటకు పరుగెత్తిన ఆమె పోలీసులకు ఫోన్‌ చేసింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు డాక్టర్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గంగాపూర్‌లోని ప్రైవేట్‌ హెల్త్‌ సెంటర్‌లో ఒక నర్సు పని చేస్తున్నది. బుధవారం రాత్రి విధుల తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నది. ఇంతలో మద్యం సేవించిన ఆసుపత్రి నిర్వాహకుడైన డాక్టర్ సంజయ్ కుమార్, ఇద్దరు సహచరులతో కలిసి ఆ నర్సుపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ నర్సు బ్లేడ్‌తో డాక్టర్‌ ప్రైవేట్‌ భాగాన్ని కోసింది. హాస్పిటల్‌ నుంచి బయటకు పరుగుతీసిన ఆమె ఒకచోట దాక్కొని పోలీసులకు ఫోన్‌ చేసింది.

పోలీసులు వెంటనే ఆ ప్రైవేట్‌ క్లీనిక్‌కు చేరుకున్నారు. బాధిత నర్సును అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన డాక్టర్‌ సంజయ్ కుమార్, అతడి ఇద్దరు అనుచరులైన సునీల్ కుమార్ గుప్తా, అవధేష్ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. సగం మద్యం సీసా, నర్సు ఉపయోగించిన బ్లేడ్, రక్తంతో తడిసిన దుస్తులు, మూడు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితులు ఆసుపత్రి లోపలి నుంచి లాక్‌ చేశారని, సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే లైంగిక దాడి యత్నాన్ని ప్రతిఘటించి ముగ్గురిని ఎదుర్కొన్న ఆ నర్సు ధైర్యసాహసాలు ప్రశంసనీయమని అన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.