Sunday, December 22, 2024
HomeUncategorizedవినేశ్ పోగ‌ట్‌పై యోగేశ్ బైరాగీ పోటీ

వినేశ్ పోగ‌ట్‌పై యోగేశ్ బైరాగీ పోటీ

Date:

దేశంలో జ‌రుగుతున్న హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన రెండో జాబితాను బీజేపీ పార్టీ మంగ‌ళ‌వారం విడుద‌ల‌ చేసింది. ఒలింపిక్ రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్‌కు వ్య‌తిరేకంగా .. బీజేపీ త‌రుపు నుంచి కెప్టెన్ యోగేశ్ బైరాగీ పోటీప‌డ‌నున్నారు. కొన్ని రోజుల క్రితం వినేశ్ ఫోగ‌ట్‌.. కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. జులానా నియోజ‌క‌వ‌ర్గం నుంచి వినేశ్ పోటీలో ఉన్నారు. ఇవాళ 21 మంది అభ్య‌ర్థుల పేర్ల‌తో బీజేపీ రెండో లిస్టును రిలీజ్ చేసింది. భార‌తీయ జ‌న‌తా యువ మోర్చ ఉపాధ్య‌క్షుడిగా బైరాగి కొన‌సాగుతున్నారు. బీజేపీ స్పోర్ట్స్ సెల్ కో క‌న్వీన‌ర్‌గా కూడా ఆయ‌న ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్ర‌జ‌ల ప‌క్షాన ఆయ‌న పోరాటం చేస్తున్నారు. అథ్లెట్ల హ‌క్కుల కోసం పోరాడుతున్న వినేశ్ ఫోగ‌ట్‌.. ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరారు.