దేశంలో స్టార్ సెలబ్రిటీల సంపాదన కోట్లల్లో ఉంటుంది.. సినిమాలతో పాటు క్రీడలు, పరిశ్రమల్లోని తమ తమ రంగాల్లో రాణిస్తూ వేల కోట్లు సంపాదించే హీరో, హిరోయిన్లు ఉన్నారు. వాటితో పాటు ఇతర బిజినెస్‌ల రూపంలోనూ భారీగానే సంపాదిస్తుంటారు. సంపాదనలో నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. అదే సమయంలో ట్యాక్స్ పే విషయంలోనూ మన సెలబ్రిటీలు ముందున్నారు. ఏడాదికి ఏకంగా రూ.కోట్ల రూపంలో ట్యాక్స్ చెల్లిస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్‌ను ఫార్చ్యూన్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయ సెలబ్రిటీలందరిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అత్యధికంగా పన్ను చెల్లించారు. ఏకంగా రూ.92 కోట్లతో ఆయన తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు పన్ను రూపంలో చెల్లించారు. ఇక రూ.75 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో, రూ.71 కోట్లతో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
అత్యధికంగా ట్యాక్స్ కట్టిన టాప్ 20 సెలబ్రిటీల జాబితా..
షారుక్ ఖాన్: రూ.92 కోట్లు
దళపతి విజయ్: రూ.80 కోట్లు
సల్మాన్ ఖాన్: రూ.75 కోట్లు
అమితాబ్ బచ్చన్: రూ. 71 కోట్లు
విరాట్ కోహ్లీ: రూ.66 కోట్లు
అజయ్ దేవగణ్: రూ. 42 కోట్లు
ఎంఎస్ ధోనీ: రూ.38 కోట్లు
రణ్‌బీర్ కపూర్: రూ.36 కోట్లు
హృతిక్ రోషణ్: రూ.28 కోట్లు
సచిన్ టెండూల్కర్: రూ.28 కోట్లు
కపిల్ శర్మ: రూ.26 కోట్లు
సౌరవ్ గంగూలీ: రూ.23 కోట్లు
కరీనా కపూర్: రూ.20 కోట్లు
షాహిద్ కపూర్: రూ.14 కోట్లు
మోహన్ లాల్: రూ.14 కోట్లు
అల్లు అర్జున్: రూ.14 కోట్లు
హార్దిక్ పాండ్యా: రూ.13 కోట్లు
కియారా అడ్వాణీ: రూ.12 కోట్లు
కత్రినా కైఫ్: రూ.11 కోట్లు
పంకజ్ త్రిపాఠి: రూ.11 కోట్లు
ఆమిర్ ఖాన్: రూ. 10 కోట్లు
రిషబ్ పంత్: రూ.10 కోట్లు