రోడ్డు ప్రమాదాలపై ఎంత అవగాహన కలిగిస్తున్నా మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆగ్నేయాసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇండియాలో అయితే టూ లేదా త్రీవీలర్ రైడర్ల మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో తెలిపింది. సేఫ్టీ 2024 రిపోర్టును డబ్ల్యూహెచ్‌వో రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం రోడ్డు మరణాల్లో.. టూ లేదా త్రీవీలర్ యూజర్లే ఉన్నట్లు తెలిపింది. ఫోర్ వీలర్ మృతులు 25 శాతం ఉన్నట్లు పేర్కొన్నది. ఇక పాదాచారులు మృతుల శాతం 21గా ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో 5 శాతం సైక్లిస్టులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారీ, అతిభారీ వాహనాల వల్ల మృతిచెందే వారి సంఖ్య 20 శాతం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. ఇండియాలో టూ, త్రీవీలర్ డ్రైవర్ల మృతుల సంఖ్య 45.1 శాతంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.