Friday, September 20, 2024
HomeUncategorizedదేశంలో భారీగా పెరిగిన పిడుగుపాటు మ‌ర‌ణాలు

దేశంలో భారీగా పెరిగిన పిడుగుపాటు మ‌ర‌ణాలు

Date:

దేశవ్యాప్తంగా పిడుగుపాటు ప్రమాదం కారణంగా మరణాలు ప్రమాదక స్థాయిలో పెరుగుతున్నాయి. 2010 నుంచి 2020 మధ్యకాలంలో పిడుగుపడి జరిగిన మరణాల సంఖ్య ప్రమాద కర స్థాయిలో పెరిగాయని ఒడిశాలోని బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను అధ్యయనం చేసింది. వాతావరణలో మార్పులు , విపరీత ధోరణలు.. అధిక పిడుగుపాటుకు దోహదం చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. 1967 నుంచి 2020 మధ్య పిడుగుపాటుకు మరణాలు 1లక్షా01వేల 309 ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కేవలం 2010నుంచి -2020 మధ్య కాలంలో పిడుగు పాటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2010నుంచి 2020 మధ్య కాలంలో దేశంలో పిడుగుపాటుల కారణంగా మరణాలు ప్రమాదకర స్థాయిలో పెరిగాయి. వాతావరణ-మార్పు ప్రేరేపిత విపరీత వాతావరణం మరిన్ని మరణాలను ప్రేరేపించే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ మెరుపు దాడుల తీవ్రత గడిచిన దశాబ్ధ కాలంలో దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా పెరగడానికి దారితీసిందన్నారు. సంవత్సరానికి సగటు 1876 మరణాలు నమోదు అవుతున్నట్లు డేటా చెబుతుంది. డేటా ప్రకారం.. మొదట నాలుగు దశాబ్దాలో 71వేల 505 మరణాలు నమోదు కాగా.. కేవలం 2010నుంచి 2020 మధ్య కాలంలో 29వేల 804 మరణాలు అంటే మొత్తం మరణాల్లో మూడో వంతు కేవలం పది సంవత్సరాల్లోనే నమోదు అయ్యాయని డేటా చెబుతుంది. రానున్న రోజుల్లో పిడుగుపాటు కారణంగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ-మార్పు ప్రేరేపిత విపరీత వాతావ రణం మరిన్ని మరణాలను ప్రేరేపించే అవకాశం ఉందంటున్నారు .