Saturday, September 21, 2024
HomeUncategorizedవిజయ్‌ రాజకీయంపై రజనీకాంత్‌ స్పందన

విజయ్‌ రాజకీయంపై రజనీకాంత్‌ స్పందన

Date:

ప్రముఖ సినీ నటుడు విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశంపై అగ్ర నటుడు రజనీకాంత్‌ స్పందించారు. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రజనీ మాట్లాడుతూ.. ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అయితే, ఆరోగ్యం సహకరించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలతో ప్రాభవం తగ్గడం, ఇటీవల డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం) అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూయడంతో తమిళ రాజకీయాల్లో శూన్యం ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు. అధికార డీఎంకేను సీఎం స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విజయ్‌ పార్టీని ప్రకటించి, తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పిన ఆయన, ఆ తర్వాత జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడతారని అన్నారు. మరో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ కూడా ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే.

.