Saturday, December 28, 2024
Homeఅంతర్జాతీయంయుద్ధాన్ని ముగించడానికి సహాయం చేయండి

యుద్ధాన్ని ముగించడానికి సహాయం చేయండి

Date:

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య మళ్లీ భీకరపోరు మొదలయింది. సోమవారం ఉదయం నుంచి మాస్కో దళాలు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా భీకర పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ దాడుల్లో ప్రాణనష్టం కూడా సంభవించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

”ఈ ఉదయం నుంచి దాదాపు 100కు పైగా క్షిపణులు, దాదాపు 100 డ్రోన్లతో రష్యా దాడి చేస్తోంది. కీలకమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. ఖర్కీవ్‌ నుంచి కీవ్‌ వరకు ఒడెస్సా నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు ప్రతి ప్రదేశంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. విద్యుత్‌ ప్లాంట్లపై దాడులు చేయడంతో చాలా చోట్ల కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. మా బలగాలు అవసరమైన చర్యలు చేపట్టాయి” అని జెలెన్‌స్కీ ఆ వీడియోలో తెలిపారు. ఈ సందర్భంగా రష్యాపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరకొరియా నుంచి బాలిస్టిక్‌ క్షిపణులతో పాటు అనేక ఆయుధాలను మాస్కో ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి బలమైన పరిష్కారాలు కావాలని అన్నారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ సహా ఇతర మిత్రపక్షాలు తమకు సాయం చేయాలని అభ్యర్థించారు.