Thursday, January 2, 2025
HomeUncategorizedమహిళ భద్రత గురించి మీరు మాట్లాడుతున్నారా..

మహిళ భద్రత గురించి మీరు మాట్లాడుతున్నారా..

Date:

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి మహిళ భద్రతకు సంబంధించి రాసిన లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. మమత ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి మండిపడ్డారు. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీకి సోమవారం ఆమె లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులను కేటాయించినప్పటికీ.. వీటిలో చాలా వరకు ప్రారంభించలేదని ఆక్షేపించారు.

”మహిళలు, బాలికలకు భద్రతా చర్యలు అమలు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఇంకా 11 ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారు” అని మండిపడ్డారు.