Saturday, September 21, 2024
HomeUncategorizedత‌మిళ‌నాడు మ‌హిళ పోలీసుల‌కు శుభ‌వార్త‌

త‌మిళ‌నాడు మ‌హిళ పోలీసుల‌కు శుభ‌వార్త‌

Date:

త‌మిళ‌నాడు మ‌హిళా పోలీసుల‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇచ్చిన ప్రసూతి సెలవులను భారీగా పెంచేసింది. ఇక నుంచి 12నెలల పాటు మెటర్నటీ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సెలవులతో పాటు మహిళా పోలీసులకు మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. డెలీవరీ అనంతరం మహిళా ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేసుకునేలా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.

చెన్నైలోని రాజరథినం స్టేడియంలో శుక్రవారం ఓ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగానే విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్రపతి పతకం, కేంద్ర హోంమంత్రి పతకాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. మహిళా పోలీసులకు ఏడాది పాటు ప్రసూతి సెలవులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మెటర్నటీ లీవ్ అనంతరం ఉద్యోగాల్లో చేరిన మహిళా పోలీసులలకు వారి తల్లిదండ్రుల, భర్త స్వగ్రామంలో వారు ఎంపిక చేసుకున్న ప్రకారం మూడేళ్లపాటు ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ నుంచి వచ్చిన అనేక అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో మహిళా పోలీసులు తొమ్మిది మాసాల ప్రసూతి సెలవులు ఉండేవి. వాటిని ఇప్పడూ ఏడాదికి పెంచుతూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. సెలవులతో పాటు డెలివరీ అయిన తర్వాత మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు రాష్ట్రపతి పతకాలు, కేంద్ర హోంశాఖ పతకాలు, ముఖ్యమంత్రి పతకాలను తమిళనాడు సీఎం స్టాలిన్ అందజేశారు.