Saturday, September 21, 2024
HomeUncategorizedమహిళల నేరాల్లో 151మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు..

మహిళల నేరాల్లో 151మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు..

Date:

దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో చట్టసభలలో 151 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఏకంగా 16 మంది సభ్యులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయాలను అసోషియేషన్ ఫర్ డెమెుక్రటిక్ రిపార్మ్స్(ఏడీఆర్) బట్టబయలు చేసింది. కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మహిళలపై నేరాలకు పాల్పడిన చట్టసభలోని సభ్యుల గురించి ఆరా తీసింది. 

*పశ్చిమబెంగాల్ మొదటి స్థానం*

మహిళలపై దాడులకు పాల్పడిన చట్టసభ సభ్యులలో బీజేపీకి చెందిన వారే ఎక్కువమంది ఉండటం గమనార్హం. ఈ 151 మందిలో 54 మంది బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటే 24 మందితో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్‌ మొదటి స్థానంలో నిలవగా 21 మందితో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. 17 మందితో ఒడిశా మూడవ స్థానంలో నిలిచింది.

*నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష*


2019 నుంచి 2024 మధ్య ఎన్నికల కమిషన్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన 4,809 అఫిడవిట్లలో 4,693ను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న 151 మందిలో 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపింది. అత్యాచార ఘటనలలో 16 మందిలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపిలు, 14 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. వీరిపై ఐపిసిలోని 376 సెక్షన్ నమోదైంది. ఈ నేరం రుజువైతే వీరికి గరిష్ఠ స్థాయిలో 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.