మహిళల రక్షణ కోసం ఎన్ని బలమైన చట్టాలు తెచ్చినప్పటికి అఘాయిత్యాలు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. 2012లో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళ(నిర్భయ)పై సామూహిక అత్యాచారం, హత్య తర్వాత గణనీయమైన చట్టపరమైన సంస్కరణలు ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం మహిళలపై దాడులు పెరుగుతోన్నాయి.
2022లో 31,000 పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. 12 ఏళ్లలోపు బాధితులకు సంబంధించిన కేసుల్లో కనీసం 10 ఏళ్ల శిక్ష, జీవిత ఖైదు లేదా మరణశిక్షతో సహా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టినప్పటికీ నేరాలు తగ్గడం లేదు. ఎన్సిఆర్బి డేటా ప్రకారం 2018 నుంచి 2022 వరకు 27 శాతం రేప్ కేసులలో శిక్షా రేటు తక్కువగానే ఉంది. 2018లో మధ్య భారతదేశంలో ఒక పసికందుపై అత్యాచారం మరియు హత్య చేసినందుకు అరెస్టు చేసిన మూడు వారాలకే 26 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు.
2019లో హైదరాబాద్లోని 27 ఏళ్ల పశువైద్యురాలిపై అత్యాచారం చేసి చంపినట్లు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసు అధికారులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారంపై ఆందోళనలు చెలరేగాయి.