Saturday, September 21, 2024
HomeUncategorizedభారతీయ రైల్వేలో డైమండ్ క్రాసింగ్

భారతీయ రైల్వేలో డైమండ్ క్రాసింగ్

Date:

భారతీయ రైల్వేలో ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 70వేల కిలోమీటర్లకు పైబడి ఉన్న రైలు మార్గాలపై రోజుకు కోటిమంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్స్ ఒక ఎత్తయితే, నాలుగు దిక్కుల నుంచి రైళ్లు రావడం మరో ఎత్తు.

నాలుగు దిక్కుల నుంచి రైళ్లు

దేశంలోని నాలుగు దిక్కుల నుంచి రైళ్లు రావడాన్ని డైమండ్ క్రాసింగ్ గా అభివర్ణిస్తారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈ జంక్షన్ ఉంది. భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అద్భుతానికి ఇది ఒక ఉదాహరణ. నాలుగు దిక్కుల నుంచి నాలుగు రైళ్లు ఒకేసారి క్రాస్ చేస్తాయి. అయినా ఇంతవరకు అక్కడ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ నిర్మాణంతోపాటు సమయ నిర్వహణ కచ్చితంగా ఉన్నప్పుడే ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవు. అన్ని దిక్కుల నుంచి వచ్చే రైళ్లను సురక్షితంగా పంపించడానికి అధికారులు, సిబ్బంది ఎంతో అప్రమత్తంగా పనిచేస్తుంటారు.

ఢిల్లీ నుంచి చెన్నై వరకు

ఇండియాలో ఏకైక డైమండ్ క్రాసింగ్ అంటే నాగపూర్ అని అర్థం. తూర్పున ఉన్న కోల్ కతా నుంచి పశ్చిమాన ఉన్న ముంబయి వరకు, ఉత్తర దిక్కున ఉన్న ఢిల్లీ నుంచి దక్షిణ దిక్కున ఉన్న చెన్నై వరకు రైలు మార్గాలను ఈ డైమండ్ క్రాసింగ్ కలుపుతుంది. భారత ఉప ఖండానికి భౌగోళిక కేంద్రంగా ఉన్న నాగపూర్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లను అనుసంధానించడంలో ఈ క్రాసింగ్ ది కీలక పాత్ర. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడతోపాటు సరకు రవాణా కూడా ఇక్కడి నుంచి సులభంగా జరుగుతుంటుంది. భారతదేశ అభివృద్ధిలో నాగపూర్ డైమండ్ క్రాసింగ్ ది కీలకమైన పాత్ర అని చెప్పొచ్చు.