బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో ఆయన తనబృందంతో చేరడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎందుకు భయమో అసలు కారణాన్ని రేవంత్‌రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద బయటపెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. తాను పుట్టింది బీజేపీలోనేనని.. చివరికి బీజేపీలోనే తన రాజకీయం ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్‌షాలకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తాను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని.. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది.. వాస్తవమా..? కాదా.. ? రేవంత్ చెప్పాలన్నారు. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిందేనని కేటీఆర్ అన్నారు.