Saturday, September 21, 2024
HomeUncategorizedబిజెపికి హ్యాట్రిక్ విజయం ఖాయం

బిజెపికి హ్యాట్రిక్ విజయం ఖాయం

Date:

దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, ఎవ్వరేమనుకున్నా తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రధాని మోడీ తెలిపారు. బీజేపీకి సొంతంగా 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి చేరిందని తెలిపారు. మూడో టర్మ్ లో ప్రపంచలోనే మూడో ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగబోతుందని పేర్కొన్నారు. మూడో టర్మ్ లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తామని.. దేశ ప్రజలు తమ పాలనను వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారని ప్రధాని మోడీ తెలిపారు.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని ప్రధాని తెలిపారు. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్‌ పదే పదే రీలాంచ్‌ చేస్తోంది.. కాంగ్రెస్‌ దుకాణం ఒక్క నాయకుడి కోసమేనని విమర్శించారు. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయని.. కాంగ్రెస్‌ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ నత్తనడకతో ఎవరూ పోటీ పడలేరంటూ సెటైర్లు వేశారు.