కేంద్ర రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు ఇదో సువర్ణావకాశం. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ జులై 30న ప్రారంభమైంది. ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హత ఉన్నవారు తమ పరిధిలోని రైల్వే జోన్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 250 పేమెంట్ చేయాలి.