ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్ట్ అయినా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయి ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉంటున్న ఈ నేతలిద్దరి కస్టడీని సెప్టెంబర్ 2వరకు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీరిని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.