Wednesday, January 15, 2025
HomeUncategorizedఖైదీల జీవితాలంటే ఎందుకంత నిర్లక్ష్యం

ఖైదీల జీవితాలంటే ఎందుకంత నిర్లక్ష్యం

Date:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఖైదీల బెయిల్ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోర్టు పేర్కొంది. ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తుల పరిష్కారానికి కోర్టు కాల పరిమితిని విధించింది. దీనిని యుపి ప్రభుత్వం అనుసరించలేదు. దీని కారణంగా కోర్టు రాష్ట్రాన్ని మందలించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు క్షమాపణలు చెప్పింది. కానీ కోర్టు క్షమాపణలను తిరస్కరించింది. మా ఆర్డర్‌ను ఆమోదించిన తర్వాత కూడా మీరు 2-4 నెలలు ఎలా తీసుకుంటారని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఎజి మసీహ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఖైదీల హక్కులకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. నేరస్తుల ప్రాథమిక హక్కులతో ఆటలాడుతున్నారు. కోర్టు ప్రకటనపై యూపీ తరపు న్యాయవాది రాకేష్ కుమార్ స్పందిస్తూ.. అధికారులు సెలవులో ఉన్నారని తెలిపారు. దానికి సుప్రీంకోర్టు స్పందిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి సచివాలయం ఫైల్‌ను ఆమోదించలేదని.. అధికారుల పేర్లను ముందుకు తీసుకురాలేదని అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.

న్యాయవాది రాకేష్ కుమార్ ఫైల్‌ను స్వీకరించడానికి నిరాకరించిన బాధ్యుల పేర్లను సమర్పించాలని మేము ఆదేశిస్తున్నామని కోర్టు పేర్కొంది. ధిక్కారంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు, ఆగస్టు 14లోగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు అఫిడవిట్ సమర్పించాలని సూచించింది. ఈ కేసును ఆగస్టు 20న జాబితా చేసింది.