Friday, December 27, 2024
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వ‌ద్ద ఆందోళ‌న‌లు

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వ‌ద్ద ఆందోళ‌న‌లు

Date:

బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ల‌క్ష్యంగా మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగాయి. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దాంతో ఆయన దిగొచ్చారు. తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని, అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. విద్యార్థులతో పాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయమూర్తుల సమావేశం అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు. చీఫ్‌ జస్టిస్‌ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేయగా.. ఆయన అందుకు అంగీకరించాల్సి వచ్చింది.

రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. జులై నుంచి దశలవారీగా జరుగుతోన్న ఆందోళనల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటిన వెనక విదేశీ హస్తం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి.