Friday, December 27, 2024
Homeఅంతర్జాతీయంగోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న వివాదాస్ప‌ద మ‌హిళా బాక్స‌ర్‌

గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న వివాదాస్ప‌ద మ‌హిళా బాక్స‌ర్‌

Date:

పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన వివాదాస్ప‌ద మ‌హిళా బాక్స‌ర్ ఇమేని ఖాలిఫ్ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది. వెల్ట‌ర్ వెయిట్ క్యాట‌గిరీ ఫైన‌ల్లో ఆమె చైనా బాక్స‌ర్ యాంగ్ లియూను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలుచుకున్న‌ది. వెల్ట‌ర్‌వెయిట్ క్యాట‌గిరీ ఫైన‌ల్లో ఆమె చైనా బాక్స‌ర్ యాంగ్ లియూను ఓడించింది. 2022 వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన ఖాలిఫ్‌.. ఆ త‌ర్వాత లింగ వివాదాన్ని ఎదుర్కొన్నారు. ఆమెలో వై క్రోమోజోమ్‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు కొన్ని రిపోర్టుల ద్వారా తేలింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ ప్రీక్వార్ట‌ర్స్ లో ఇట‌లీ బాక్స‌ర్‌.. కేవ‌లం 46 సెక‌న్ల‌లోనే మ్యాచ్ నుంచి వైదొలిగింది.

2023 వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ స‌మ‌యంలో జెండ‌ర్ ప‌రీక్ష ద్వారా ఇమేని ఖాలిఫ్‌ను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. కానీ పారిస్ ఒలింపిక్స్ కోసం మాత్రం.. అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ.. 2016, 2021 నాటి ఒలింపిక్స్ రూల్స్‌ను అమ‌లు చేసింది. దీంతో బాక్స‌ర్ ఖాలిఫ్‌కు పారిస్‌లో ఆడేందుకు అవ‌కాశం ద‌క్కింది. ఫైన‌ల్ కోసం ఎరుపు రంగు దుస్తుల్లో రింగ్‌లోకి రాగానే.. స్టేడియంలో ఇమేనీ ఇమేనీ అంటూ అరుపులు మారుమోగాయి. ఆ వాతావ‌ర‌ణంలో చైనా బాక్స‌ర్ యాంగ్ ఒంట‌రి అయిపోయారు. తొలి రౌండ్‌లోనే ప్రత్య‌ర్థికి లెఫ్ట్‌, రైట్ హుక్ ఇచ్చింది ఖాలిఫ్‌. పూర్తి కంట్రోల్ తీసుకున్న అల్జీరియా బాక్స‌ర్ .. ఈజీగా చైనీస్ అమ్మాయిని ఓడించి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని చేజిక్కించుకున్న‌ది.