Saturday, September 21, 2024
HomeUncategorizedపాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకుంటే 1000 ఫైన్

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకుంటే 1000 ఫైన్

Date:

దేశంలోని పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసేందుకు గత సంవత్సరంతోనే గడువు ముగిసింది. ఇప్పటికీ చాలా మంది పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయలేదు. అయితే ప్రస్తుతం ఫైన్ కట్టడం ద్వారా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మీరు రూ.1000 చెల్లించి పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను శాఖకు ఈ జరిమానా విధించడం వల్ల ఇప్పటి వరకు రూ.601.97 కోట్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖ సోమవారం విడుదల చేసింది. గత సంవత్సరం జులై 1 నుంచి ఈ సంవత్సరం జనవరి 31 వరకు ఈ జరిమానా వసూలు చేసినట్లు వివరించింది. “పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి రూ.1000 ఫైన్ విధిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో చెప్పాలి” అని లోక్ సభలో టీఎంసీ ఎంపీ మాలరాయ్ ప్రశ్నించారు.

ఎంపీ ప్రశ్నంకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఈ ఏడాది జనవరి 29 నాటికి దేశంలో 11.48 కోట్ల పాన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. పాన్ ఆధార్ కార్డు లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు పని చేయదు. మీ పాన్ కార్డు పనిచేయకపోతే మీరు ఎలాంటీ ఆర్థిక లావాదేవీలు జరపలేరు. కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేరు. ఇప్పుడైనా పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్న శాఖ కోరుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ లోకి వెళ్లి పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి. మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలంటే రూ.1000 చెల్లించాల్సిందే. రూ.1000 చెల్లించిన తర్వాతే మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు.