Friday, December 27, 2024
Homeఅంతర్జాతీయంఒలింపిక్స్‌లో మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌ను వేధించిన రెజ్ల‌ర్‌

ఒలింపిక్స్‌లో మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌ను వేధించిన రెజ్ల‌ర్‌

Date:

ఒలింపిక్స్‌లో పాల్గొన‌డం, ప‌త‌కం సాధించ‌డం చాలా మంది క్రీడాకారుల జీవిత‌ల‌క్ష్యంగా ఉంటుంది. విశ్వ‌క్రీడ‌ల్లో స‌త్తా చాటేందుకు ఎంతోమంది క్రీడాకారులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతూనే ఉంటారు. టోర్నీ సమయంలో పతకమే లక్ష్యంగా అవిశ్రాంతంగా సాధన చేస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా మహిళ పట్ల సభ్యంగా ప్రవర్తించిన ఓ రెజ్లర్‌ను ఫ్రెంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఒలింపిక్స్‌ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు రెజ్లర్‌ ముహమ్మద్ అల్-సయ్యద్ గురువారం అర్థరాత్రి తాగిన మత్తులో ఓ మహిళను అసభ్యంగా తాకినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జరిగిన 67 కేజీల గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో ముహమ్మద్ అల్-సయ్యద్ అజర్‌బైజాన్‌ దేశానికి చెందిన హస్రత్ జఫరోవ్ చేతిలో ఓడిపోయాడు. అరెస్టయని అతడిని విడుదల చేసే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని నిర్వాహకులు తెలిపారు. కాగా.. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో అల్-సయ్యద్‌ కాంస్యం సాధించాడు.