Monday, December 23, 2024
Homeక్రైంనీకు హాజ‌రు వేయాలంటే ముద్దు పెట్టాలి..

నీకు హాజ‌రు వేయాలంటే ముద్దు పెట్టాలి..

Date:

పిల్ల‌ల‌కు పాఠాలు చెపుతూ స్పూర్తిగా ఉండాల్సిన ఒక ఉపాధ్యాయుడు తోటి మ‌హిళా ఉపాధ్యాయురాలిపై లైంగికంగా వేధింపుల‌కు గురిచేశాడు. ఆమె హాజరు విషయాన్ని అడ్డుపెట్టుకుని ముద్దు కోసం డిమాండ్‌ చేశాడు. ముద్దు లేదా కోరిక తీరుస్తేనే నీ హాజరు వేస్తానని మెలికపెట్టాడు. అయితే ఆ ఉపాధ్యాయుడి వెకిలి వేషాలను బాధిత ఉపాధ్యాయురాలు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెటిజన్‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నావ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన విధులకు సంబంధించిన హాజరు శాతం విషయమై తోటి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్లింది. తన హాజరుకు ఆమోదం తెలపాలని కోరింది.

దాంతో ‘నీ హాజరు వేయాలంటే నాది ఒక షరతు ఉంది. అది చాలా సరదాగా ఉంటుంది. చాలా సులువుగా పని అవుతుంది’ అని ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించాడు. ‘ఏమిటా షరతు..?’ అని ఉపాధ్యాయురాలు అడుగగా ఆ ఉపాధ్యాయుడు సిగ్గు పడుతూ, మురిసిపోతూ తన బుగ్గను చూపిస్తూ ‘ముద్దు కావాలి’ అని చెప్పాడు. అందుకు మహిళా టీచర్‌ నిరాకరించింది. ‘నీ షరతుకు నేను అంగీకరించను. ఇది చాలా దరిద్రమైన పని’ అని బదులిచ్చింది.