Sunday, September 22, 2024
HomeUncategorizedరోడ్లు లేకున్నా పోలాల్లో బ్రిడ్జి నిర్మాణం

రోడ్లు లేకున్నా పోలాల్లో బ్రిడ్జి నిర్మాణం

Date:

బీహార్ రాష్ట్రంలో ఓ బ్రిడ్జి నిర్మాణం వైరల్‌గా మారింది. పూర్తిగా మైదాన ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ నిర్మించిన ఫోటో వైరల్ అయింది. ఈ బ్రిడ్జ్‌కి రోడ్డు లేకపోవడం, పొలాల్లో ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇరు వైపులా రోడ్డు లేకుండా రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించారు. ముఖ్యమంత్రి గ్రామీణ సడక్ పథకం కింద అరారియా జిల్లాలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. పర్మానందర్‌పూర్ గ్రామంలో 3 కి.మీ పొడవైన రహదారి, వంతెన ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతంలో నది ఉందని, వర్షాకాలంలో సమస్యగా మారుతోందని, మిగిలిన ఏడాది ఇది ఎండిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో గ్రామాలను కలుపేందుకు రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మితమైన ప్రాంతాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే, మిగిలిన ప్రాంతాన్ని అధికారులు ఇంకా సేకరించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో సేకరించిన భూమిలో ప్రభుత్వం అప్రోచ్ మార్గం లేకుండానే వంతెన నిర్మించింది. దీనిపై అరారియా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్ స్పందించారు. ” ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి నివేదిక కోరాను. దీంతో పాటు సబ్ డివిజనల్ అధికారి, సర్కిల్ ఆఫీసర్, సంబంధిత ఇంజనీర్ సైట్‌ని సందర్శించాలని కోరాను. భూములు అందుబాటులో లేని సందర్భంతో ఈ ప్లాన్ ఎలా రూపొందించారనే విషయాన్ని పరిశీలిస్తున్నాము. అవసరమైన చర్యలు తీసుకుంటాము” అని కలెక్టర్ చెప్పారు.