ఓ మహిళ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ లో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యశ్వంత్ పుర నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న రైలులో బీహార్ కి చెందిన మహిళ హీనా కాతూన్(22) కి పురిటినొప్పులు వచ్చాయి.
భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఆ మహిళకి నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు108 సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే రైలులోనే మహిళ ప్రసవించి ఆడబిడ్డకు జన్మనించింది. ప్రసవానంతరం తల్లిబిడ్డలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు.