Monday, December 23, 2024
Homeక్రైంమూడేళ్ల చిన్నారిపై ప‌డిన ఇంటి ఇనుప గేటు

మూడేళ్ల చిన్నారిపై ప‌డిన ఇంటి ఇనుప గేటు

Date:

మూడేళ్ల చిన్నారిపై భారీ ఇనుప గేటు పడింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్ర పూణెలోని పింప్రి – చించ్‌వాడ్‌ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తోటి స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు గేటు తీసుకుని ఇంటి లోపలికి వెళ్తారు. అనంతరం గేటును వేయగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన మూడేళ్ల చిన్నారిపై ఇనుప గేటు ఒక్కసారిగా పడుతుంది. దీంతో భయాందోళనకు గురైన ఇతర పిల్లలు అక్కడినుంచి పరుగులు తీస్తారు.

ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన చిన్నారిని గిరిజా గణేష్ షిండేగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ శివాని పవార్‌ తెలిపారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీధిలోని ఓ ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.