Monday, September 23, 2024
HomeUncategorizedసొంత‌ గూటికి చేరుకున్న గ‌ద్వాల ఎమ్మెల్యే

సొంత‌ గూటికి చేరుకున్న గ‌ద్వాల ఎమ్మెల్యే

Date:

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగుతాన‌ని కేటీఆర్‌కు చెప్పిన‌ట్లు తెలిసింది. రెండో విడత రుణ మాఫీలో కాంగ్రెస్ ఉండగా.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. కేటీఆర్ సమక్షంలో ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుని మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్న వేళ.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంతగూటికి చేరుకోవడం చర్చనీయంశంగా మారింది.

కృష్ణ మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 74 కు చేరింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చెవేళ్ల ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. త్వరలో మరి కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం గమనార్హం. కృష్ణమోహన్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నేతలతో పడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే కేసీఆరే కావాలని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి పంపారని మరి కొందరు వాదిస్తున్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్‌లోకి వలసలు తగ్గుతాయని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.