Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంఒలింపిక్స్‌లో క్రీడాకారుడిగా చైల్డ్ రేపిస్టు

ఒలింపిక్స్‌లో క్రీడాకారుడిగా చైల్డ్ రేపిస్టు

Date:

రసవత్తరంగా కొనసాగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో ఓ బీచ్ వాలీబాల్ ప్లేయ‌ర్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే నెద‌ర్లాండ్స్‌కు చెందిన‌ స్టీవెన్ వాన్ డె వెల్డే. ఆదివారం తన దేశం తరఫున బీచ్ వాలీబాల్ తొలి రౌండ్ గేమ్ ఆడాడు. పూల్ బీలో భాగంగా ఇటలీతో జరిగిన ఈ గేమ్‌లో నెదర్లాండ్స్ ఓడిపోయింది. తన జోడి మ్యాథ్యూ ఇమ్మర్స్‌తో కలిసి స్టీవెన్ వాన్ డె వెల్డే ఈ గేమ్ ఆడాడు. ఇటలీ జోడి క్యారంబులా- ర్యాన్‌ఘీరి చేతిలో 22-20, 19-21, 15-13, 2-1 (టైబ్రేక్) స్కోర్‌తో నెదర్లాండ్స్ పరాజయం పాలైంది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ హైలైట్‌గా నిలిచాడు స్టీవెన్ వాన్ డె వెల్డే. ఒలింపిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాడు.

గతంలో స్టీవెన్‌ 12 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలు జీవితాన్ని కూడా గడిపాడు. సుమారు 13 నెలల పాటు జైలులో ఉన్నాడు. ఆన్ లైన్‌లో పరిచయం అయిన బాలికపై 2016లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఒక సంవత్సరం బ్రిటన్‌లో, ఒక నెల నెదర్లాండ్స్‌లో కారాగారంలో గడిపాడు. అప్పటికి అతని వయస్సు 19 సంవత్సరాలు. నెదర్లాండ్స్ చట్టాల ప్రకారం..అతని శిక్షా కాలం తగ్గింది. 13 నెలల జైలు శిక్ష పూర్తయిన తరువాత మళ్లీ తన క్రీడా జీవితాన్ని పునః ప్రారంభించాడు. 2017 నుంచి బీచ్ వాలీబాల్‌లో ఆడుతున్నాడు. నెదర్లాండ్స్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపుగా పొందాడు. గతంలో బీచ్ వాలీబాల్ కేటగిరిలో తన దేశం తరఫున పలు టోర్నీల్లో ఆడాడు. పతకాలను సాధించాడు. ప్రతిభ ఆధారంగా అతన్ని పారిస్ ఒలింపిక్స్‌కు ఆ దేశ క‌మిటీ నామినేట్ చేసింది.