Monday, December 23, 2024
Homeక్రైంఆడపిల్ల పుట్టిందని పసిగుడ్డను చంపిన తల్లి

ఆడపిల్ల పుట్టిందని పసిగుడ్డను చంపిన తల్లి

Date:

ఆడపిల్ల పుట్టిందంటే అదృష్టం అని భావించే వారు ఉంటారు. కాని ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపింది. ఇది గమనించిన ఆమె భర్త షాక్‌ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఔటర్ ఢిల్లీ ముండ్కా ప్రాంతంలోని బాబా హరిదాస్ కాలనీలో నివసిస్తున్న 22 ఏళ్ల మహిళ తొమ్మిది రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేక దారుణానికి పాల్పడింది. గురువారం కత్తితో పసికందైన కూతురి గొంతు కోసి హత్య చేసింది.

 ఇది తెలిసి ఆ మహిళ భర్త గోవింద్ షాక్‌ అయ్యాడు. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రెండో అంతస్తులోని ఒక గదిలో పసికందు మృతి చెంది ఉండగా, మరో గదిలో తల్లి ఉండటాన్ని గమనించారు. ఆ మహిళను ప్రశ్నించగా తనకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెప్పింది. అక్కడ పడి ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.