Tuesday, October 8, 2024
HomeUncategorizedమూడు రోజులు 62 రైళ్లు రద్దు..

మూడు రోజులు 62 రైళ్లు రద్దు..

Date:

కేంద్ర రైల్వేశాఖ ప్రయాణీకులకు కీలక సమాచారం ఇచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని పూణే డివిజన్‌లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి. దౌండ్‌లో ఇంటర్‌లాకింగ్ పనిని నిర్వహించడానికి సెంట్రల్ రైల్వే మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసింది. ఈ క్రమంలో జులై 29న మొత్తం 15 రైళ్లు, జులై 30న 23 రైళ్లు, జులై 31న 24 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు జూలై 29న రైలు నెం 12025 పూణే-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, రైలు నెం 12169 పూణే-సోల్పూర్ ఎక్స్‌ప్రెస్, రైలు నెం 01511 పూణే-బారామతి DMU, రైలు నెం 01487 పూణే-హరంగుల్ TOD ఎక్స్‌ప్రెస్, రైలు నెం 11406 అమరావతి-పూణే ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి. జులై 30న రైలు నం 17613 పన్వెల్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, రైలు నెం 11421 హడప్సర్-సోలాపూర్ DMU ఎక్స్‌ప్రెస్, రైలు నెం 11409 దౌండ్-నిజాంబాద్ DMU ఎక్స్‌ప్రెస్ రైలు నెం 01522 డౌండ్-హడప్సర్ DMU రద్దయ్యాయి.

అదే రోజున రైలు నెం 12220 సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రద్దు అయింది. జులై 31న (బుధవారం) రోజున రైలు నెం 11041 దాదర్-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్, రైలు నెం 01529 పూణే-డౌండ్ DMU, రైలు నెం 17630 నాందేడ్-పూణే ఎక్స్‌ప్రెస్, రైలు నెం 01525 పూణే-డౌండ్ MEMU ప్యాసింజర్, రైలు నెం 12026 సికింద్రాబాద్-పూణె ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మూడు రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులు రైల్వే శాఖ తాజా నిర్ణయం మేరకు అప్రమత్తం కావాలని..పూర్తి సమాచారంతో ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.