Monday, December 23, 2024
Homeక్రైంపెళ్లి చేసి అల్లుడికి నెలకు రూ.30వేలు పంపాడు

పెళ్లి చేసి అల్లుడికి నెలకు రూ.30వేలు పంపాడు

Date:

ఒక యువతి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగినా ఆరు నెలలకే వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అమీన్‌పూర్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. గుంటూరు పట్టణ పరిధి శ్రీనివాసరావుపేటకు చెందిన హర్షిత(22) అదే జిల్లా ఎడ్లపాడుకు చెందిన మహేశ్‌ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు ఫిబ్రవరి 23న వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.3లక్షలు ఇచ్చారు.

అనంతరం అమీన్‌పూర్‌ పురపాలక పరిధి సిద్ధార్థ ఎన్‌క్లేవ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బీటెక్‌ చదివిన మహేష్‌కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి అనిల్‌కుమార్‌ నెలకు రూ.30వేలు పంపుతున్నారు. బెంగళూరులోని ఓ ఐటీ సంస్థ నుంచి జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ వచ్చినా మహేశ్‌ వెళ్లలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగాయి.

ఆస్తిలో వాటా కావాలంటూ హర్షితతో నిత్యం గొడవలు పడుతున్నాడు. మనోవేదనకు గురైన హర్షిత శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దళిత యువతి అయిన హర్షిత మృతిపై అనుమానాలున్నాయని సమగ్ర విచారణ జరిపించాలని దళిత బహుజన ఫ్రంట్‌(డీబీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి కల్పన డిమాండ్‌ చేశారు.