Friday, September 20, 2024
HomeUncategorizedకూతురు భారం కాదు.. భరోసా..!

కూతురు భారం కాదు.. భరోసా..!

Date:

ఆడపిల్ల పుట్టిందంటే ఇప్పటికి బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆడపిల్ల అంటే ఇంకా కొన్ని గ్రామాల్లోని కుటుంబంలో దుఃఖమే తన్నుకువస్తుంది.. ఆడపిల్లతో అన్ని ఇబ్బందులే అనుకునే వారు ఉన్నారు. కాని అక్కడక్కడ కొంతమంది మనుషులు మారుతున్నారు. ఆడపిల్ల పుడితే ఒక పండుగలా ఆనందాలు చేస్తున్నారు. ఆడపిల్ల మహాలక్ష్మి అనుకునే వారు సంఖ్య పెరుగుతోంది. 

ముందడుగు ప్రత్యేకం

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మగబిడ్డను కనాలనే ఆశతో ఒకదాని తర్వాత మరొకటి ప్రసవించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేశంలో రోజు రోజుకు ఆడ పిండాలను చంపడం వంటి నేరాలు ఇంకా జరుగుతున్నాయి. అలాంటిది బీహార్‌లో జరిగిన ఈ ఘటన అక్కడికి నిజంగానే ఉదాహరణగా నిలిచింది. ఏడుగురు కూతుళ్ల విజయాల కారణంగా పిండి మిల్లు కార్మికుడు రాజు ఆనందంగా జీవిస్తున్నాడు. రాజ్‌కుమార్ సింగ్ బీహార్‌లోని సరన్ జిల్లా నివాసి. రాజుకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇరుగు పొరుగు వారి మాటల కారణంగా ఈ ఏడుగురు కూతుళ్ల పెళ్లి ఎలా చేస్తారన్న ఆందోళన ఎప్పుడూ ఉండేది. పెళ్లి ఖర్చుల నుంచి మొదలుకొని, వరుడి ఇంటివారు తనఖా డిమాండ్ చేస్తే, ఆ ఖర్చులన్నీ ఆ తండ్రి ఎలా భరిస్తాడు? చుట్టుపక్కల వారు ఆ అమ్మాయిలను భారంగా భావించారు.

*పిండిమిల్లే జీవనాధారం..*

రాజు పిండి మిల్లు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఈరోజు రాజు ఏడుగురు కూతుళ్లంతా పోలీసులే. ఈ కుమార్తెలు తమ తండ్రికి రెండు ఇళ్లు కట్టించారు. ఒకప్పుడు తన కూతుళ్ల భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన ఈ తండ్రి ఇప్పుడు కూతుళ్లతోనే సరికొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

పోలీసు పరీక్షలో ఉత్తీర్ణులై ఆ ఏడుగురు అమ్మాయిలకు ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద కూతురు రాణి బీహార్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో.. రెండవ అమ్మాయి ఎస్ఎస్బిలో, మూడో అమ్మాయి సోని సిఆర్ఫీఎఫ్ లో, ప్రీతి క్రైమ్ బ్రాంచ్‌లో, నాల్గవ అమ్మాయి పింకీ ఎక్సైజ్ పోలీసుగా, ఐదవ అమ్మాయి బీహార్ పోలీస్‌లో, ఆరవ అమ్మాయి జిఆర్పీలో, ఏడవ అమ్మాయి కూడా పోలీసే.. ఇలా రాజు కూతుళ్లు అందరూ వివిధ డిపార్ట్’మెంట్‌లలో పోలీసు ఉద్యోగాలు సాధించారు.. ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలు యువరాజును తిట్టడం లేదు, కానీ అతని కుమార్తెలను ఉదాహరణగా చూపుతున్నారు.. కూతురిని భారంగా భావించే వారికి ఈ ఏడుగురు సోదరీమణుల కథ సరైన సమాధానంగా నిలుస్తోంది. అందుకే ఆడపిల్లను చదివిస్తే ప్రయోజకురాలిగా మారుతుందనేది వీరే ఒక ఉదాహరణ..