పర్సనల్ లోన్ యాప్ ద్వారా కేరళకు చెందిన మహిళా టెకీ దన్య మోహన్ సుమారు 20 కోట్ల మేర ఆర్థిక నేరానికి పాల్పడింది. మణప్పురం కంపెనీకి చెందిన పర్సనల్ లోన్ యాప్ ద్వారా ఆమె డబ్బును కాజేసింది. ఓ ఫేక్ లోన్ అకౌంట్ క్రియేట్ చేసిన ఆ మహిళ.. ఆ అకౌంట్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసి.. ఆ తర్వాత తన స్వంత బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మణప్పురం కాంప్‌టెక్ కంపెనీలో మేనేజర్‌గా ఆమె కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఆ కంపెనీలోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ అయ్యింది. దీని ద్వారా ఆ కంపెనీకి చెందిన పూర్తి డేటాను ఆమె యాక్సిస్ చేసుకున్నది. ఇక లోన్ యాప్ ద్వారా ఇన్‌స్టాంట్ లోన్ పద్ధతిలో డబ్బును కాజేసింది.
మహిళా టెకీ దన్య మోహన్ తన వద్ద ఉన్న డబ్బును తన భర్తకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె ఒంటరిగానే నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదేమీ వ్యవస్థీకృత నేరం కాదు అని పోలీసులు భావిస్తున్నారు. భర్తకు సుమారు 40 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, దీన్ని పరిశీలించాని ఓ విచారణాధికారి తెలిపారు. జూలై 23వ తేదీ వరకు నిందితురాలు దన్య మోహన్ అనుకున్నట్లే సాగింది. కానీ అప్లికేషన్ విషయంలో పై అధికారి ఒకరు ఆమెకు సమన్లు జార ఈచేశారు. 80 లక్షల లావాదేవీకి చెందిన అనుమానాలు రావడంతో ఆమె గురించి ఆరా తీశారు. ఆ బదిలీ గురించి ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నది. కంపెనీకి దొరికినట్లు తెలియగానే ఆమె తన ఫోన్‌ను స్విఛాఫ్ చేసి పరారీ అయ్యింది. అలువాలో ఆమె లాస్ట్ లొకేషన్ దొరికింది. పలు బృందాలు పోలీసులు ఆమె కోసం వెతికారు. ఆమెకు మెడికల్ టెస్ట్ చేశారు. త్రిస్సూర్‌కు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు.