Thursday, October 31, 2024
HomeUncategorizedపెట్రో ధరల తగ్గింపుపై సీతారామ‌న్ కీలక వ్యాఖ్యలు

పెట్రో ధరల తగ్గింపుపై సీతారామ‌న్ కీలక వ్యాఖ్యలు

Date:

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసివస్తే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని చెప్పారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బిహార్‌లను మాత్రమే బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని, ఏ ఒక్క రాష్ట్రానికీ నిధులను నిరాకరించలేదని అన్నారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు మోదీ 3.0 ప్రభుత్వ తొలి బడ్జెట్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి.