Tuesday, October 8, 2024
HomeUncategorizedముఖేష్ అంబానీ నెల ఇంటి కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..

ముఖేష్ అంబానీ నెల ఇంటి కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..

Date:

మన దేశానికి చెందిన కుబేరుడు ముకేష్ అంబానీ అని  పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతో కలిసి ఆంటిలియా అనే పెద్ద ఇంట్లో నివసిస్తున్నారు. మొత్తం 27 అంతస్తుల ఇల్లు అది. వీరికి ఇంట్లోనే మినీ థియేటర్ ఉంది. ఈ మధ్యనే ఆయన తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం చాలా గ్రాండ్ గా చేశారు. ఈ పెళ్లికి దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 

మన దేశంలో కెల్లా అత్యంత ఖరీదైన వివాహం గా దీనిని చెప్పొచ్చు. కేవలం పెళ్లి మాత్రమే కాదు.. అనంత్- రాధిక మర్చంట్ ల సంగీత్, మెహందీ వేడుక, పెళ్లి, వివాహాం అనంతరం వేడుకలను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తన కొడుకు పెళ్లికి రూ.5వేల కోట్లు ఖర్చు చేసిన అంబానీ… కి ఎన్నో లగ్జరీ ఇల్లు ఉన్నాయనే విషయం తెలిసిందే.

తన విలాసవంతమైన ఇల్లు యాంటిలియాకి ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెలుసా..? అంబానీ తన ఫ్యామిలీతో కలిసి ఆంటిలియా అనే పెద్ద ఇంట్లో నివసిస్తున్నారు. మొత్తం 27 అంతస్తుల ఇల్లు అది. వీరికి ఇంట్లోనే మినీ థియేటర్ ఉంది. అంతేకాదు.. 9 లిఫ్ట్ లు, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడులు 100 కంటే ఎక్కువ కార్లు పట్టగల పార్కింగ్ స్థలం కూడా ఉంది.

అంబానీ ఉంటున్న ఈ ఇంటిని పూర్తి చేయడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని నిర్మించడానికి రూ.15వేల కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. అంబానీ యాంటిలియా ఇంట్లో దాదాపు 600 మంది పనిచేస్తున్నారని కూడా చెబుతున్నారు. కొందరికి లక్షల్లో జీతం వస్తుంది. సరే, ఆంటిలియా ఇంటికి కరెంటు బిల్లు ఎంత? ఈ ఇల్లు చాలా ఎత్తుగా ఉండడంతో హై ఓల్టేజీ విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి.

ముంబైలోని 7,000 మంది మధ్యతరగతి ప్రజలు అందెలియా ఇంట్లో కరెంటు వినియోగిస్తున్నారని చెబుతున్నారు. యూనిట్ ప్రాతిపదికన, అంబానీకి చెందిన యాంటిలియా ఇంటికి ప్రతి నెలా దాదాపు 6,37,240 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారట. నివేదికల ప్రకారం ఈ ఇంటి కరెంటు బిల్లు రూ.70 లక్షలకు పైగా ఉంటుంది.