Tuesday, October 8, 2024
HomeUncategorizedఈ మూడు విభాగాల్లో బంగారు పతకాలు పక్కా..?

ఈ మూడు విభాగాల్లో బంగారు పతకాలు పక్కా..?

Date:

ఒలింపిక్స్‌లో తమ ప్రతిభను చూపి సత్తా చాటాలనుకునే క్రీడాకారులు బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 7 మెడల్స్ గెలిచింది. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచాడు. మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో మీరాబాయి చాను, పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో రవి కుమార్ దహియా సిల్వర్ మెడల్స్ సాధించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పివి సింధు, మహిళల వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ ఈవెంట్‌లో లోవ్లినా బోర్గోహైన్, పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా, పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు గెలిచారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో మరిన్ని మెడల్స్ సాధించాలని అథ్లెట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

గ్రేస్‌నోట్ ప్రిడిక్షన్స్ ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ గెలవబోయే పతకాల సంఖ్యను అంచనా వేయలేదు. అయితే ఇండియా కచ్చితంగా ఐదు పతకాలు సాధిస్తుందని ఏజెన్సీ పేర్కొందంటూ ఆన్‌లైన్‌లో కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు బాక్సింగ్, షూటింగ్, అథ్లెటిక్స్‌లో ఒక్కో గోల్డ్ మెడల్‌ పాటు మరో రెండు సిల్వర్ మెడల్స్ గెలుచుకుంటుందని ట్వీట్స్‌లో పేర్కొన్నారు. ఈ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది.

* అథ్లెటిక్స్

అథ్లెటిక్స్‌లో మరో గోల్డ్ మెడల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా, ఈసారి కూడా పారిస్‌లో గోల్డ్ మెడల్ సాధించవచ్చు. అలాగే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజర్ అవినాష్ సేబుల్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడు గోల్డ్ మెడల్ కంటెస్టెంట్‌.

* బాక్సింగ్‌

బాక్సింగ్‌లో ఇండియా నుంచి ఇద్దరు మహిళా ప్రపంచ ఛాంపియన్లు నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్ పోటీ పడుతున్నారు. అలాగే నిశాంత్ దేవ్, అమిత్ పంఘల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ ఉమెన్ బాక్సర్స్ మరింత స్ట్రాంగ్‌గా ఉన్నారు.

* షూటింగ్

షూటింగ్‌లో కూడా భారత్ చాటా బలంగా ఉంది. గత రెండు ఎడిషన్లలో భారతదేశానికి ఈ ఈవెంట్లలో మెడల్స్ రాలేదు. కానీ ఈసారి మను భాకర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, సరబ్జోత్ సింగ్ వంటివారు ఇతర దేశాల షూటర్లకు గట్టి పోటీ ఇవ్వనున్నారు.