Tuesday, October 8, 2024
Homeఅంతర్జాతీయంచంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయి

చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయి

Date:

చంద్రుడిపైన చైనా నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది.  చాంగే-5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా అందులో నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. తమ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.

చంద్రుడిపై మట్టినమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. అనంతరం వాటిపై బీజింగ్‌ నేషనల్‌ లేబొరేటరీ ఫర్‌ కండెన్స్‌డ్‌ మ్యాటర్‌ ఫిజిక్స్‌, సీఏఎస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫిజిక్స్‌ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆ నమూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని సీఏఎస్‌ ఇటీవల పేర్కొంది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్‌లో ప్రచురించినట్లు పేర్కొంది.