Monday, October 7, 2024
HomeUncategorizedఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్..

ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లో పాన్..

Date:

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ వినియోగ‌దారుల‌కు పాన్‌కార్డు అనేది త‌ప్ప‌నిస‌రి చేసింది. బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ పాన్‌కార్డు తీసుకొవాల‌ని ప్ర‌భుత్వం తప్ప‌న‌సరి చేసింది. ఆదాయ వ్యయాలను ట్రాక్ చేయడానికి పాన్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రూ.50 వేల మించి డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. అయితే పాన్ కార్డు పొందాలంటే ఓ పది రోజుల పడుతుందని అందరూ చెబుతారు. కానీ పెరిగిన టెక్నాలజీ కారణంగా కేవలం పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందవచ్చని తెలుసా? మీరు వింటున్నది నిజమే. ఆధార్ కార్డు ఉంటే కేవలం పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందవచ్చు. ఈ-పాన్ కింద పిలిచే ఈ కార్డును ఎలా పొందాలో? ఓసారి తెలుసుకుందాం.

ఈ-పాన్ డౌన్‌లోడ్ ఇలా

ఈ-పాన్ సదుపాయం అనేది చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్న దరఖాస్తుదారుల కోసం కేటాయిస్తారు. అయితే పాన్ కార్డు అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో జారీ అవుతుంది. అలాగే ఈ సేవలను పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఈ-పాన్ అంటే ఆధార్‌కు సంబంధించిన ఈ-కేవైసీ డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేసే డిజిటల్ సైన్ పాన్ కార్డ్ అని అర్థం. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉండడమే కాకుండా డాక్యూమెంట్ ఫ్రీ సర్వీస్‌గా పొందవచ్చు. ఈ సర్వీస్‌ను పొందాలంటే మీ ఆధార్‌కు కచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఈ-పాన్‌లు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంతో పాటు కేవైసీ అవసరాలకు కూడా ఆమోదం ఉంటుంది. ఈ-పాన్ అనేది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

ఈ-పాన్ పొందే విధానం

ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి. ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి తక్షణ ఇ-పాన్ క్లిక్ చేయాలి. ఈ-పాన్ పేజీలో కొత్త ఈ-పాన్ పొందు క్లిక్ చేయాలి. గెట్ న్యూ ఈ-పాన్ పేజీలో మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ఐ ఎగ్రీ అనే చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించుపై క్లిక్ చేయాలి.
ఓటీపీ ధ్రువీకరణ పేజీలో చెక్ బ్యాక్స్ క్లిక్ చేసి ప్రోసీడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఓటీపీ ధ్రువీకరణ పేజీలో ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లో అందుకున్న 6 అంకెల ఓటీపీ నమోదు చేయాలి. యూఐడీఏఐ ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ వివరాల ధ్రువీకరణ పేజీలో ఐ యాక్సెప్ట్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేస్తే పది నిమిషాల్లో మీ పాన్ కార్డును మెయిల్ ద్వారా వస్తుంది.